- Advertisement -
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో 5వ పతకం చేరింది. క్వాలిఫికేషన్‌లో 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరుకుని స్వర్ణంపై ఆశలు పెంచిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్‌లో 89.45 మీటర్ల దూరం విసిరాడు. అయితే నీరజ్ కంటే ఎక్కువ దూరం విసిరిన పాక్ ఆటగాడు ఒలింపిక్స్ చరిత్రలోనే రికార్డు నెలకొల్పాడు.
పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ఏకంగా 92.97మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే వీరిద్దరు కూడా తొలి ప్రయత్నంలో పౌల్ చేయగా రెండో ప్రయత్నంలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన చేయడం గమనార్హం.
టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణం గెలిచిన నీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు.
Also Read:‘డబుల్ ఇస్మార్ట్’..పక్కా ఎంటర్‌టైనర్
- Advertisement -