సాగునీటి రంగంలో కాంగ్రెస్ విఫలం: జగదీష్ రెడ్డి

11
- Advertisement -

గత 8 నెలలుగా తెలంగాణలో పరిపాలన పడకేసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి..ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదు అన్నారు. మరీ ముఖ్యంగా సాగునీటి రంగంలో ఘోరంగా విఫలమైందని,గత యాసంగి (రబీ) పంటకు నీళ్లు అందించలేకపోయిందన్నారు. గతంలో కేసీఆర్ పాలనలో యాసంగిలోనే భారీగా దిగుబడి వచ్చిందన్నారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు లక్షలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోందన్నారు.ఆ నీటిని కాలువల ద్వారా చెరువులు నింపే అవకాశం ఉందని కానీ ఈ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదు అన్నారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లు వస్తాయన్న సమాచారం ఉందని ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదు అన్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో వర్షాభావం కారణంగా కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయని, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపాలన్నారు.

ఖమ్మం జిల్లా పాలేరు కూడా ఖాళీగా ఉందని… ఆ రిజర్వాయర్ సహా దాని కింద ఉన్న చెరువులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా నది నీటిని కిందికి వదిలి సముద్రం పాలు చేస్తున్నారు..కాళేశ్వరం మోటర్లతో నీటిని ఎత్తిపోసి సూర్యాపేట వరకు నీటిని తీసుకురావాలన్నారు. ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు అని కాంగ్రెస్ నేతలు అన్నారు…మరి ఎస్సారెస్పీ నుంచి ఎందుకు సూర్యాపేటకు ఇవ్వడం లేదు? అన్నారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై బద్నాం చేస్తున్నారు..రైతులకు నీళ్లు ఇవ్వలేక నిందను, నెపాన్ని కాళేశ్వరంపైకి నెట్టేస్తున్నారు అన్నారు. సుందిళ్ల, అన్నారం ద్వారా ఎల్లంపల్లి నింపాలి. తద్వారా వరంగల్, సూర్యాపేటకు నీళ్లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

Also Read:BRS: రుణమాఫీ జరగని రైతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్

- Advertisement -