- Advertisement -
పారిస్ ఒలింపిక్స్ ఓటమిపై స్పందించింది పీవీ సింధు. డిఫెన్స్‌లో తప్పులు చేయడం వల్లే ఓటమి పాలయ్యానని తెలిపారు. డిఫెన్సివ్ షాట్లను ఎదుర్కొనే క్రమంలో తప్పులు చేశానని, విజయం కోసం శతవిధాలా ప్రయత్నించానని చెప్పారు. చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చాం అని, ఈ ఓటమికి నేనేం పశ్చాత్తాప పడటం లేదని అన్నారు.
వచ్చే ఒలింపిక్స్‌లో ఆడతానా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు. ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని కాబట్టి స్వదేశం వెళ్లాక విశ్రాంతి తీసుకుని మళ్లీ బరిలోకి దిగుతానని చెప్పారు. ఒక్కోసారి మనది కాని రోజు చూడాల్సి వస్తోందని చెప్పారు.
ప్రీ క్వార్టర్స్‌లో 21-19,21-14 తేడాతో ఓటమి పాలైంది సింధు. రియో ఒలింపిక్స్ 2016లో రజతం, టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం గెలిచింది సింధు.
Also Read:శ్రీశైలంకు పోటెత్తిన పర్యాటకులు..
- Advertisement -