Harishrao: కాంగ్రెస్ అంటేనే ధోకా, 8 నెలల్లో ఎన్ని ధోకాలో తెలుసా?

42
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అంటేనే ధోకా అని,ఈ 8 నెలల్లో ఎన్ని ధోకాలు ఇచ్చిందో తెలుసా? అధ్యక్ష అని తెలిపారు మాజీ మంత్రి హరీష్‌ రావు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడిన హరీష్ రావు… డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ధోకా ఇచ్చిందని ఎద్దేవా చేశారు.

ప్రతి మహిళలకు నెలకు 2500- ధోకా,రైతు భరోసా కింద రైతన్నకు ధోకా,కౌలు రైతుకు 15 వేలు -ధోకా,డిసెంబర్ 9 న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ – ధోకా,అన్ని పంటలకు మద్దతు ధరపై 500 బొనస్ -ధోకా,విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు -ధోకా,మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ -ధోకా,25 వేల పోస్టులలో మెగా డిఎస్సీ – ధోకా అని విమర్శించారు.

వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు -ధోకా,నిరుద్యోగ భృతి -ధోకా,వెంటనే డిఏ, పిఆర్సి ఇస్తామని ప్రభుత్వ, ఉద్యోగులు ఉపాధ్యాయులకు -ధోకా,ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం -ధోకా,మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ -ధోకా,అవ్వా, తాతలకు 4వేల ఫించన్ -ధోకా,దివ్యాంగులకు 6వేల పింఛన్ -ధోకా,కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం -ధోకా,ఆటో డ్రైవర్లకు 12 వేల ఆర్థిక సాయం -ధోకా అన్నారు. ప్రతి రోజూ సీఎం ప్రజాదర్బార్ -ధోకా,ధోకా, ధోకా,ధోకా… కాంగ్రెస్ అంటేనే ఓ పెద్ద ధోకా పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్‌.

Also Read:TTD:జనతా క్యాంటీన్లపై ఈవో ప్రత్యేక దృష్టి

- Advertisement -