రాజ్ తరుణ్ హీరోగా హాసిని సుధీర్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం పురుషోత్తముడు. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా కీలక పాత్ర పోషించగా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం…
కథః
విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఇండియాకు వస్తాడు రామ్(రాజ్ తరుణ్). తన వారసుడిగా తమ కంపెనీకి రామ్‌ని సీఈవో చేయాలనుకుంటాడు తండ్రి (మురళి శర్మ). అయితే ఆ కంపెనీలో 50 షేర్ ఉన్న వసు (రమ్యకృష్ణ) ఇందుకు ఒప్పుకోదు. ఇందుకోసం ఓషరతు విధిస్తుంది. ఆ షరతుకి రామ్ ఒప్పుకుంటాడు. ఇంతకీ వసు విధించిన షరతు ఏంటి?ఆ తర్వాత రామ్ పడిన కష్టాలు ఏంటీ? ,వంద రోజులు ఎవరికీ తెలియకుండా ఉండాలనే నిబంధనని పాటించాడా? బ్రేక్ చేశాడా? చివరికి సీఈవో ఎవరు అయ్యారు? అన్నదే పురుషోత్తముడు సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఎమోషనల్ సీన్స్, రాజ్ తరుణ్ నటన. రాజ్ తరుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో అద్భుత నటన కనబర్చాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసి నడిపించాడు. ఇక హీరోయిన్ హాసిని సుధీర్ తన గ్లామర్ తో అలరించింది. సినిమాకు మరో హైలైట్ రమ్యకృష్ణ నటన. తన పాత్రకి వందశాతం న్యాయం చేసింది. మిగితా నటీనటుల్లో ప్రకాశ్ రాజ్, మురళీశర్మ, బ్రహ్మానందం ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీని హైలైట్ చేసిన దర్శకుడు దానిని సెకండాఫ్‌లోనూ కొనసాగిస్తే బాగుండేది. కొన్ని చోట్ల ఫన్ బాగానే పేలింది. అయితే, ఆ ఫన్ ను కూడా దర్శకుడు సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయాడు. దీంతో, సెకండ్ హాఫ్ బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా బాగుంది. కథ పాతదే అయినా దర్శకుడు ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. స్క్రీన్ ప్లే పరంగా ‘పురుషోత్తముడు’ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం. రామ్ భీమన డైరెక్షన్, గోపిసుందర్ సినిమాటోగ్రఫీ, మార్తాండ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది.
Also Read:నారా రోహిత్… ‘సుందరకాండ’
తీర్పు:
శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమిందార్ వంటి సినిమాలు ఈ కాన్సెప్ట్ తో వచ్చినవే అయినా పురుషోత్తముడు మెప్పించిందనే చెప్పుకోవాలి. రాజ్ తరుణ్ ,రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ నటన సినిమాకు ప్లస్ కాగా ఈ సినిమాతో రాజ్ తరుణ్ సక్సెస్ బాట పట్టారనే చెప్పాలి. మొత్తంగా ఈ వీకెండ్‌లో చూడదగ్గ చిత్రం పురుషోత్తముడు.
విడుదల తేదీ : 26/07/ 2024
రేటింగ్ : 3/5
నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్,
సంగీత దర్శకుడు: గోపీ సుందర్
నిర్మాతలు : డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్
దర్శకులు: రామ్ భీమన