వైసీపీతో నష్టపోయిన ఏపీ,బాబు చెప్పేవి అబద్దాలే!

30
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఏపీలో అప్పులకు సంబంధించిన చంద్రబాబు చేసిన ప్రకటనను జగన్ తప్పుబట్టగా, వైసీపీ పాలన వల్ల ఏపీకి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు చంద్రబాబు. అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు చంద్రబాబు.

పోలవరం పూర్తయి ఉంటే ఏపీకి రూ. 45 వేల కోట్ల ఆదాయం వచ్చేదని , ఇసుక అక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ. 7 వేల కోట్లు , గనుల దోపిడీ ద్వారా రాష్ట్రానికి రూ.9,750 కోట్ల మేర నష్టం జరిగిందని మండిపడ్డారు. 2014-19 టీడీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త పోర్టులు ప్రారంభించామని వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు(, గవర్నర్‌ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లు అప్పులని వినిపించారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయవలిసి వస్తుందన్న భయంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం లేదని విమర్శించారు.

Also Read:KTR: ఆగస్టు 2 డెడ్ లైన్, ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన కేటీఆర్

- Advertisement -