Harishrao:రుణమాఫీలో కొత్త చిక్కులు, ఆధారాలతో హరీష్ ట్వీట్

33
- Advertisement -

డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీష్‌..ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీ ని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్ ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నారు.నాకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను. పరిష్కరించాలని కోరుతున్నా అని తెలంగాణ సీఎంవోకు ట్వీట్ చేశారు హరీష్.

Also Read:ఆకాష్ జగన్నాథ్‌గా పేరు మార్చుకున్న ఆకాష్ పూరి

 

- Advertisement -