స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం దువ్వాడ జగన్నాథమ్ . ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన సాంగ్ , టీజర్ ఫ్యాన్స్ లో బజ్ క్రియేట్ చేస్తుంది. జూన్ 23న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ . ఈ చిత్ర ట్రైలర్ కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన వివి వినాయక్ … రామానాయుడుగారు కథానాయకుల్ని, కాంబినేషన్‌లని కాకుండా కథని నమ్మి సినిమాలు తీసేవారు. దిల్‌రాజు కూడా ఆయన దారిలోనే నడుస్తున్నారు. చిత్రసీమకు ఆయన మరింతమంది దర్శకుల్ని పరిచయం చేయాలి. ఇది నా సొంత సంస్థ. ఈ సంస్థలో ‘దిల్’ తీసి పద్నాలుగు ఏళ్లు అయ్యిందంటే నమ్మబుద్ది కావడం లేదు. హరీష్ అంటే నాకు ఇష్టం. ఆయన ఉత్సాహం నాకు నచ్చుతుంది. బన్నీ కూడా అంతే హుషారుగా ఉంటాడు. ‘డీజే’లోని రెండు మూడు సన్నివేశాలు నాకు ఇది వరకే చెప్పారు. బాగా నచ్చాయన్నారు.
దిల్ కోసం వినాయక్‌కి అడ్వాన్సు ప్రసాద్ లాబ్‌లోనే ఇచ్చాను. ఇక్కడే నా 25వ సినిమా వేడుక జరగడం ఆనందంగా ఉంది. నా దర్శకులే నాకు వెన్నుదన్నుగా నిలిచారు. బన్నీతో చేస్తున్న సినిమా ఇది. మా ఇద్దరికీ హ్యాట్రిక్ అవుతుంది. నాకెప్పుడూ జయాపజయాలతో సంబంధం ఉండదు. ఓ సినిమా ఆడకపోవడానికి చాలా కారణాలుంటాయి. అన్నింటికంటే ప్రతిభ ముఖ్యం. దాన్ని చూసే దర్శకులతో ప్రయాణం చేస్తుంటా. హరీష్‌తో ఇది నా మూడో చిత్రం. తనతో మరో సినిమా కూడా చేస్తా. నా దర్శకులంతా ‘మీరు దర్శకత్వం చేయొద్దు’ అని సలహా ఇస్తున్నారు. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ చేయను. ఎందుకంటే ఓ సినిమా కోసం దర్శకులు పడే కష్టాన్ని నేను కళ్లారా చూస్తున్నా. అది చూస్తే భయం వేస్తోందన్నారు దిల్‌రాజు.
దర్శకుడు హరీష్ మాట్లాడుతూ ఎడిటింగ్ రూమ్‌లో ఓ ట్రైలర్‌ని కట్ చేసి ఇద్దరు ముగ్గురుకు చూపించాలంటే భయంగా ఉంటుంది. ఇక్కడ ఈ వేదికపై ఇంతమంది దర్శకులకు చూపించడానికి నేనెంత భయపడి ఉంటానో అర్థం చేసుకోండి. వాళ్లందరికీ ఈ ట్రైలర్ నచ్చడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఏ సమస్య వచ్చినా వినాయక్ దగ్గరకే వెళ్తా. ఆయనంటే అంత ఇష్టం. వినాయక్ గారి దగ్గర సహాయ దర్శకుడిగా నన్ను నియమించమని కోన వెంకట్‌ని ఎన్నోసార్లు అడిగా. కానీ అవకాశం రాలేదు. కానీ ఆయనకు నేను ఏకలవ్య శిష్యుణ్ని. నాకు ఆయన ద్రోణాచార్యుడి కంటే ఎక్కువ. ఓ పరాజయం తరవాత బంధాలూ, బాంధవ్యాలకు బీటలు వారడం సహజమే. కానీ ‘రామయ్యా వస్తావయ్యా’ తరవాత కూడా నన్ను దిల్‌రాజు నమ్మారు. కేవలం 20 నిమిషాల కథ విని ‘ఈ సినిమా హిట్ అవుతుంది స్క్రిప్టు సిద్ధం చేయి’ అని ప్రోత్సహించారు. సహజంగా దర్శకులంతా తమకు ఏం కావాలో కథానాయకుడి నుంచి రాబట్టుకొంటారు. కానీ.. బన్నీ మాత్రం తనకు ఏం కావాలో దర్శకుల నుంచి రాబట్టుకొంటాడు. తన వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందన్నారు.
బోయపాటి శ్రీను చెబుతూ ‘భద్ర’ సినిమాని బన్నీతో చేయాలనుకొన్నా. అది కుదరలేదు. కానీ కథ నచ్చి బన్నీనే నన్ను దిల్‌రాజు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సినిమా దిల్‌రాజు సంస్థలో చేయడానికి బన్నీ ఓ కారణం. దర్శకుల చేతిలో ఓ గైడ్ లాంటి వ్యక్తి దిల్‌రాజు అన్నారు. దిల్‌రాజు ఇలానే వంద సినిమాలు చేయాలని ఆకాంక్షించారు దశరథ్. తీసిన సినిమా ఆడినా ఆడకపోయినా మళ్లీ ఆ దర్శకుడితో సినిమా తీయడం ఈ సంస్థకే సాధ్యమైందన్నారు వంశీపైడిపల్లి. హరీష్ శంకర్ సంభాషణలు అంటే నాకు ఇష్టం. గబ్బర్ సింగ్‌లోని కొన్ని డైలాగుల్ని ‘ఫిదా’లో గుర్తు చేయబోతున్నామని శేఖర్ కమ్ముల చెప్పారు. ఈ కార్యక్రమంలో త్రినాథరావు నక్కిన, సాయికిరణ్ అడవి, వేణుశ్రీరామ్, భాస్కర్, వాసువర్మ, అనిల్ రావిపూడి, శ్రీవాస్, సతీష్ వేగ్నేశ, శ్రీకాంత్ అడ్డాల, శిరీష్ పాల్గొన్నారు.