పేమెంట్ కోటాలో వచ్చావా?, రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

22
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందనే దానిపై చర్చ జరుగుతోండగా కేటీఆర్ – రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. రేవంత్ మాట్లాడుతూ తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని కష్టపడి స్వయంకృషితో వచ్చానని తెలిపారు.

జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా,ఎంపీగా, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాని చెప్పారు. ఇక దీనికి కేటీఆర్ సైతం స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చారు. సీఎంకు ఓపిక ఉండాలని, పేమెంట్ కోటాలో రాలేదని నేను కూడా అనొచ్చు అని రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు. సీఎం వ్యాఖ్యలు రాజీవ్ గాంధీని అంటున్నారా? రాహుల్ గాంధీని అంటున్నారా? చెప్పాలన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకోవడంతో వీరిద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది.

Also Read:లండన్‌లో కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్

- Advertisement -