లండన్‌లో కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్

25
- Advertisement -

ఎన్నారై బీ.ఆర్.యస్ యుకె శాఖ ఆధ్వర్యంలో లండన్ లో భారస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మాజీ మంత్రి వర్యులు శ్రీ. కెటిఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎన్నారై టి ఆర్ బీ.ఆర్.యస్ యుకె అద్యక్షులు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీ.ఆర్.యస్ కార్యకర్తలు హాజరుకావడం జరిగింది.

ఎన్నారై బీ.ఆర్.యస్ ఆద్వర్యం లో జరిగిన వేడుకల్లో అద్యక్షులు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ కెటిఆర్ గారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, మరియు మరెన్నో ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలని బ్రెంట్ఫోర్డ్ హనుమాన్ హిందూ ఆలయంలో కేటీర్ గారి పేరు మీద ప్రత్యేక పూజలు జరిపించిరని తెలియజేసారు.

ఎన్నారై బీ.ఆర్.యస్ ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ నేడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా IT రంగానికి ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం KTR గారని మరియు హైదరాబాద్ ఇంత వేగంగా డెవెలెప్మెంట్ కావడానికి KTR గారి కృషిని గుర్తుచేశారు.

చివరిగా కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కల మాట్లాడుతూ ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి ప్రవాస బిడ్డ కేటీఆర్ గారి వెంటే ఉంటామని, హాజరైన కార్యవర్గ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన వేడుకల్లో, కేక్ కట్ చేసి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపి, ప్రతీ సంవత్సరం లండన్ లో కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నామని తెలిపారు.

ఈ వేడుకల్లో ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే సెల్ అద్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, ప్రవీణ్ వీర, హరి గౌడ్ నవాబీపేట్, శ్రీకాంత్ జెల్ల, సత్య చిలుముల, జాయింట్ సెక్రటరీ మల్ల రెడ్డి బీరం, సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, రవి ప్రదీప్ పులుసు, రవి రేతినేని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -