KCR:కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం

16
- Advertisement -

మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.

ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల సమస్య, శాంతి భద్రతల నిర్వహణ, చేనేత కార్మికుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టనున్నారు.

అలాగే పంటల మద్దతు ధర, బోనస్‌ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం-రైతు భరోసా చెల్లింపులో జాప్యం వంటి అంశాలను ప్రస్తావించనున్నారు. గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం,ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలలో జాప్యం వంటి సమస్యలను ప్రస్తావించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

Also Read:KTR:ఏపీ,బీహార్ బడ్జెట్‌లా కేంద్రబడ్జెట్

- Advertisement -