KTR: కొత్త న్యాయచట్టాలపై మీ స్పందనేంటి?

23
- Advertisement -

కొత్త న్యాయ చట్టాలపై సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేటీఆర్ బ‌హిరంగ లేఖ రాశారు.నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు.

వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయి. నూతన చట్టాల‌పైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తెలంగాణ గడ్డపైన నిరంకుశ, నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ యధాతథంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా? లేక తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:తెలుగు ట్రెండింగ్‌లో ‘డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్’

- Advertisement -