శేరిలింగంపల్లిని వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్..లండన్ థెమ్స్ నదిలా మూసీ సుందరీకరిస్తాం అన్నారు.
మూసీ రివర్ డెవలప్మెంట్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 50వేల కోట్లతో పనులను ప్రారంభించుకోబోతున్నాం అన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యం అని,ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉందన్నారు.
రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని,మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతాం అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని, వచ్చే పదేళ్లలో హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా అన్నారు.
Also Read:కరెంట్ కోతలపై కేటీఆర్ ట్వీట్..వైరల్