ఫార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు

20
- Advertisement -

పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశంలో గవర్నర్ రాధాకృష్ణన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కలిసి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లాం అన్నారు.మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న నాయకులందరం గవర్నర్ ని కలవటం జరిగిందని,ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కుతున్నదో ఆయకు వివరించటం జరిగిందన్నారు.

హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల మీద నిర్భంధం, అణిచివేత, అరెస్ట్ లు, అక్రమ కేసులతో భయానక వాతావారణం పునరావృతం చేస్తున్నారని చెప్పాం అన్నారు. సిటి సెంట్రల్ లైబ్రరీ లో లాఠీ ఛార్జ్, ఓయూ విద్యార్థులపై దాడి చేస్తూ ఉద్యమ నాటి అణిచి వేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రయోగిస్తుందని ఆయన దృష్టికి తెచ్చాం అని, 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ కు సంబంధించి వాళ్లిచ్చిన ప్రకటనలు, హామీలను గవర్నర్ తెలిపాం అన్నారు. గ్రూప్ 1, 2, 3 కి సంబంధించి పోస్టులు పెంచుతామని…ఆ హామీ పట్టించుకోవటం లేదన్నది వివరించాం అన్నారు.

గవర్నర్ గారు చాలా సీరియస్ గా ఈ అంశాలపై స్పందించారు. హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని చెప్పారన్నారు. రెండో అంశం రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యాంగ హననం జరుగుతుందో కూడా గవర్నర్ కి చెప్పాం, మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకున్న సంగతి ఆయనకు తెలిపాం అన్నారు.దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని… స్పీకర్ గారికి కూడా ఫిర్యాదు చేశామని ఆయనకు వివరించాం అన్నారు. బీఆర్ఎస్ పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం అన్నారు.

Also Read:కరెంట్ కోతలపై కేటీఆర్ ట్వీట్..వైరల్

- Advertisement -