రాష్ట్రంలో డీపీహెచ్ విభాగంగా స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్… ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్‌వాడీలే కాదు.. ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించింది అని హరీశ్‌రావు మండిపడ్డారు.
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో నర్సింగ్ బదిలీల ప్రక్రియ రసాభాసగా మారిందన్నారు. కౌన్సెలింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ వందల మంది నర్సులు శుక్రవారం రాత్రి కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందు రాస్తారోకో నిర్వహించారు. డీపీహెచ్ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే నిరసన తెలిపారు.
ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్‌వాడీలే కాదు, ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించింది.
బదిలీల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతున్నదని స్టాఫ్ నర్సులు రెండు రోజులుగా తమ కుటుంబాలను వదిలి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం… pic.twitter.com/qmHO8grwDM
— Harish Rao Thanneeru (@BRSHarish) July 20, 2024
Also Read:కరెంట్ కోతలపై కేటీఆర్ ట్వీట్..వైరల్