షాకింగ్..కరోనా వచ్చిన వారిలో డయాబెటిస్!

13
- Advertisement -

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి ఎంతోమందికి నిద్రలేకుండా చేసింది. ఇక కరోనా సోకిన వారిలో ఇప్పటికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. తాజాగా కరోనా బారిన పడ్డ చిన్నారులు టైప్ 1 డయాబెటిస్ బారిన పడుతున్నారని జర్మన్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

కరోనా సమయంలో చిన్నారుల్లో ఈ వ్యాధి నిర్ధరణ రేటు చాలా ఎక్కువగా ఉందని జర్మనీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ రీసెర్చ్ కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. కోవిడ్ బారినపడిన చిన్నారుల్లో ఈ ఐలెట్ ఆటో యాంటీబాడీల స్థాయి అధికంగా ఉందని వెల్లడైందని..ఫలితంగా టైప్ 1 షుగర్ బారిన పడే లక్షణాలు వేగంగా బయటపడుతున్నాయని చెప్పారు.

అలాగే కలుషితమైన గాలి పీల్చుకోవడం వల్ల కూడా షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఈమధ్యే చేసిన అధ్యయనాల్లో తెలిసింది. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది.

Also Read:5 నిమిషాలు ఇలా చేయండి..బరువు తగ్గండి!

- Advertisement -