విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చండి:సుప్రీం

22
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం….ద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని త‌ప్పుబ‌ట్టింది.

ప్రెస్‌మీట్‌లో అభిప్రాయాలు వ్య‌క్త‌ప‌ర‌చ‌డం స‌రికాద‌ని సీజేఐ ధ‌ర్మాస‌నం పేర్కొంది. తక్షణం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించగా సోమవారం వరకు సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు ప్రభుత్వ తరపు న్యాయవాది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అభిషేక్ మ‌నుసింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా వాద‌న‌లు వినిపించగా కేసీఆర్ త‌ర‌పున ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించారు.

ఇది కక్ష సాధింపు చర్య అని విచారణకు ముందే దోషిగా ఎలా తేలుస్తారో చెప్పాలన్నారు రోహిత్గీ. ఈఆర్సీ ఉండ‌గా, మ‌ళ్లీ విచార‌ణ క‌మిష‌న్ అవ‌స‌రం లేదు… అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

Also Read:చండీపురా వైరస్..అజాగ్రత్తగా ఉంటే అంతే!

- Advertisement -