వానలు దంచి కొడుతుండటంతో సీజనల్ వ్యాధులు కూడా అంతే స్థాయిలో విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగ్యూ,మలేరియాతో పాటు కలర కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. కేరళతో పాటు గుజరాత్‌లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కలరా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నారు.
కలరా అనేది అతిసార వ్యాధి. ఈ వ్యాధి విబ్రియో కలరే అను బాక్టీరియా వలన సోకుతుందిజ. నీరు ద్వారా లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి. ఆతి విరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే వైద్య సహాయం అందకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువ. కలరా బ్యాక్టీరియా చిన్న ప్రేగుల్లోకి వెళ్లి విరోచనాలు, వాంతులకు కారణమవుతుంది.
ప్రధానంగా కలుషిత నీటిని తాగడం, అపరిశుభ్రమైన రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది. కలరా బ్యాక్టీరియా ఇమ్యూనిటీ వ్యవస్థను దెబ్బతీసి పలు సమస్యలకు కారణం అవుతుంది. కలరా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సుమారు 2 వారాలకు లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు బయటపడిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. వాష్ రూమ్ కు వెళ్లిన ప్రతిసారి సబ్బుతో చేతులు కడుక్కోవాలి. స్వచ్చమైన ఆహారంతోపాటు, కాచిచల్లార్చిన నీరు తాగాలి.
Also Read:TTD: 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం