భారీ వర్షాలతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూ,మలేరియా వంటి వ్యాధులకు తోడు పలు వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లక్షణాలు కనిపిస్తే అది చండీపురా వైరసేనని..అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్లలో చండీపురా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. గుజరాత్లో ఈ వైరస్ సోకి నలుగురు పిల్లలు మృతి చెందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మెదడుపై ఈ వైరస్ అటాక్ చేస్తుంది..నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతంకంగా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా 9 నెలల నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లల ఈ వైరస్ లక్షణాలుంటాయని చెబుతున్నారు. ఈ వైరస్ సోకితే జ్వరం రావడం,వాంతులు,మూర్చ చివరికి మరణం సంభవిస్తుందని చెబుతున్నారు అధికారులు. భారతదేశంలో CHPV వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటివరకు 322 మంది పిల్లలు మరణించారు. అందులో 183 మంది ఆంధ్రప్రదేశ్లో, 115 మంది మహారాష్ట్రలో 24 మంది గుజరాత్లో మరణించారు. మంచి పోషకాహారం, ఆరోగ్యం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వైరస్ను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read:కలెక్టర్లతో సీఎం రేవంత్ రివ్యూ