అప్పుడు రకుల్..ఇప్పుడు ఆమె తమ్ముడు!

14
- Advertisement -

డ్రగ్స్ డొంక లాగిన ప్రతిసారి సినిమా ఇండస్ట్రీ పేరు వినబడటం కామన్ అయింది. భారీగా డ్రగ్స్ పట్టుబడిన ప్రతిసారి టాలీవుడ్ నటులు లేదా వారి బంధువుల పేర్లు వినబడుతూనే ఉన్నాయి. తాజాగా అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఉందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేయగా 13 మంది పట్టుబడ్డారు. ఇందులో సినీ నటి రకుల్ ప్రీత్‌సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్‌సింగ్ ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే డ్రగ్స్ కేసులో రకుల్ పేరు సైతం వినబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రకుల్ తమ్ముడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ6గా ఆయన్ని చేర్చారు.

నైజీరియాకు చెందిన ఒనూహ బ్లెసింగ్‌ అలియాస్‌ జొయానాగోమ్స్‌ అలియాస్‌ జో అనే మహిళ డ్రగ్స్‌ కింగ్‌పిన్‌ అని గుర్తించామని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్‌, సానబోయిన వరుణ్‌కుమార్‌, మహమ్మద్‌ మహబూబ్‌ షరీఫ్‌ వీరి ముఠాలో పెడ్లర్లుగా పనిచేస్తున్నారని… రూ.35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్‌ను సీజ్‌ చేశాం అని పోలీసులు తెలిపారు.

రకుల్‌ సోదరుడు ప్రస్తుతానికి కస్టమరేనని తాము గుర్తించామని… అతను నిజంగానే కస్టమరా? లేక డ్రగ్స్‌ సప్లయరా? అనేది దర్యాప్తులో తేలుతుందని తెలిపారు పోలీసులు. గతంలో డ్రగ్స్‌ కేసులో రకుల్‌ పేరు బయటపడటం…తాజాగా ఆమె సోదరుడు అమన్ పోలీసులకు చిక్కడంతో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Also Read:Dandruff:డాండ్రఫ్‌కి వీటితో చెక్‌..!

- Advertisement -