ISRO:సముద్రగర్భంలో రామసేతు

35
- Advertisement -

రామసేతు నిజంగానే ఉందని స్పష్టం చేసింది ఇస్రో. భారత్ – శ్రీలంక మధ్య నిర్మించారని చెబుతున్న రామసేతు అబద్దం కాదని…నిజమేనని వెల్లడించింది ఇస్రో. ఇందుకు సంబంధించి ఫోటోలను రిలీజ్ చేసింది.

తమిళనాడులో రామసేతు వంతెనకు సంబంధించిన మ్యాప్ ను.. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్ శాట్ 2 డేటాను ఉపయోగించి రిలీజ్ చేశారు. ఈ రామసేతు వంతెన పొడవు 29 కిలోమీటర్ల వరకూ ఉంటుందని …సముద్రగర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం ఇది 99.98 శాతం నీటిలోనే ఉందని …2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ వరకూ.. అంటే ఆరేళ్ల డేటాను ఇస్రో సిద్ధం చేసింది. త్రేతాయుగంలో రామాయణకాలంలో లంకాధిపతి అయిన రావణుడు సీతమ్మను అపహరించి లంకలోనే ఉంచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వానరసైన్యంతో లంకకు చేరుకునేందుకు ఈ రామసేతును నిర్మించారని ప్రచారంలో ఉంది. ఆ తర్వాత 1480 వరకూ వచ్చిన తుపానుల కారణంగా రామసేతు ధ్వంసమైందని చెబుతుండగా దీనిపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్రో రామసేతు నిజమేనని తేల్చేసింది.

Also Read:కన్నప్పలో శరత్ కుమార్ ఉగ్రరూపం

- Advertisement -