బిడ్డను కంటే రూ.92 వేలు..ఎక్కడో తెలుసా?

23
- Advertisement -

పుతిన్ నేతృత్వంలోని రష్యా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలో సంతానోత్పత్తిని పెంచేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. స్థానిక యూనివర్సిటీ, కాలేజీల్లో చదివే 25 ఏళ్ల లోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డను కంటే వారికి రూ. 92వేలు బహుమతిగా ఇస్తామంటూ ప్రకటించారు రష్యా అధికారులు.

వచ్చే ఏడాది జనవరి 1 నుండి ఈ స్కీం అమల్లోకి రానుంది. ఇటీవల ఉక్రెయిన్ తో యుద్ధంతో రష్యాలోని చాలామంది యువకులు ప్రాణాలు కొల్పోయారు. దీంతో బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటారన్న భయంతో చాలా మంది దేశాలను వదిలి పారిపోయారు.

ఈ నేపథ్యంలో రష్యాలో సంతానోత్పత్తిని పెంచేందుకు కండోమ్స్, గర్బనిరోదక మాత్రలు వంటి వాటిపై నిషేధం విధించింది. ఇక ప్రతి రష్యా మహిళా ఎనిమిది మందికి జన్మనివ్వాలని ఆదేశాలిచ్చింది. పుతిన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రష్యాలో చర్చనీయాంశంగా మారింది.

Also Read:ఫ్రీజ్‌లో కోడి గుడ్లు..ఈ తప్పు చేయకండి!

- Advertisement -