సస్పెన్స్ థ్రిల్లర్..నిన్ను వదలను

12
- Advertisement -

లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో యు వీ టి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ) మరియు శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ సంయుక్తంగా అశోక్ కుల్లర్ నిర్మాతగా దేవేంద్ర నెగి సహ నిర్మాతగా షిరాజ్ మెహది దర్శకత్వంలో వస్తున్న సినిమా నిన్ను వదలను. గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోవా హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగే ఈ సినిమా హర్రర్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుంది.

లియుబా పామ్ రష్యాలో పుట్టి పెరిగారు. ఆమె ఒక సింగర్ మరియు ప్రొడ్యూసర్ కూడా. రష్యాలో సేవ్ ద చిల్డ్రన్ అని ఒక డాక్యుమెంటరీ ఫిలిం కి నిర్మాతగా మరియు లవ్ ఓవర్ ఈవిల్ అనే టీవీ సిరీస్ కి రైటర్ మరియు నిర్మాత గా వ్యవహరించారు. ఇప్పుడు స్ట్రైట్ తెలుగులో నిన్ను వదలను అనే హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు.

Also Read:TTD:భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత

- Advertisement -