పరదాలు కడితే…సస్పెండే!

21
- Advertisement -

పరదాలు కట్టే అధికారులను సస్పెండ్ చేయడం తప్ప మరోమార్గం లేదన్నారు సీఎం చంద్రబాబు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు, నారా లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

గత ఐదు సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రిని చూశాం.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూశామని నారా లోకేశ్ అన్నారు. ఇదే క్రమంలో అధికారులు ఇంకా పరదాలు కడుతున్నారు సర్.. వాళ్లు సెట్ అయ్యేసరికి ఇంకా సమయం పడుతుందని అనుకుంటా సర్ అంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ లోకేశ్ వ్యాఖ్యానించారు. వెంటనే చంద్రబాబు కల్పించుకొని లేదు సెట్ అయ్యారు అంటూ సమాధానం ఇచ్చారు. ఇంకా పరదాలు కడుతున్నారు సర్ అని లోకేశ్ మరోసారి అనడంతో.. చంద్రబాబు నవ్వుతూ.. పరదాలు కట్టినట్లు ఇంకోసారి తమ దృష్టివస్తే వారిని సస్పెండ్ చేయడం తప్ప మరోమార్గం లేదని అన్నారు.

1995 సమయంలో సీఎంను మరోసారి చూస్తారు… అప్పటి చరిత్రను గుర్తుపెట్టుకోవాలన్నారు. అప్పుడు నువ్వుకూడా (లోకేశ్ ను ఉద్దేశిస్తూ) కుర్రాడివి.. నీకు కూడా గుర్తులేదు అంటూ చంద్రబాబు సరదాగా వ్యాఖ్యలు చేశారు.

Also Read:Karthi:’మిస్టర్. X’ షూటింగ్ పూర్తి

- Advertisement -