లండన్‌లో మారణహోమం..

156
Seven dead in London Bridge
Seven dead in London Bridge
- Advertisement -

ఇటీవల అమెరికా పాప్ స్టార్ ఏరియానా గ్రాండ్ నిర్వ‌హిస్తున్న క‌న్స‌ర్ట్‌ను టార్గెట్ చేస్తూ మాంచెస్ట‌ర్‌లో పేలుడు జరిగిన సంగతి తెలిసిందే.. ఆ ఘ‌ట‌న వ‌ల్ల 19 మంది మృతిచెందగా.. మరో 50 మంది గాయ‌ప‌డ్డారు. తాజాగా లండన్‌లో మరోమారు ఉగ్ర కలకలం రేగింది. శనివారం రాత్రి లండన్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా దిశ మార్చుకుని బీభత్సం సృష్టించింది. కారులోని దుండగులు పాదచారులను తొక్కించుకుంటూ ముందుకుసాగారు. అదే వేగంతో ముందుకెళ్లి బోరో మార్కెట్ వద్ద ఓ ప్రదేశంలో వ్యాన్ ను ఆపి, కిందకు దిగి, పక్కనే ఉన్న బార్లు, రెస్టారెంట్లపై దాడులు జరిపారు. ఈ రెండు ఘటనల్లో ఇప్పటి వరకు ఏడుగురు పౌరులు మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు కాల్చి చంపారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు రెండుసార్లు నెత్తుటి ఏర్లు పారించడంతో… లండన్ పౌరులు భయంతో వణికిపోతున్నారు. ఈ దాడులను లో-టెక్, హై-ప్రొఫైల్ దాడులుగా అభివర్ణిస్తున్నారు.

4brk94a

అయితే లండన్‌లో మారణహోమం సృష్టించిన టెర్రరిస్టులను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడు ఓ ట్యాక్సీ డ్రైవర్‌. జనాలపైకి దూసుకెళ్తున్న ఉగ్రవాదిని కారుతో ఢీకొట్టి హతమార్చేందుకు ప్రయత్నించాడు. కానీ.. అతని ప్రయత్నం విఫలమైంది. కారు దాడి నుంచి తప్పించుకున్న ఆ సాయుధుడు జనాలపై ఎగబడి విచక్షణారహితంగా దాడి చేశాడు. నిమిషాల వ్యవధిలోనే పొడిచి పలువురిని చంపేశాడు. తన ప్రయత్నం ఫలించి ఉంటే అమాయక ప్రజల ప్రాణాలు దక్కేవని ఆ ట్యాక్సీ డ్రైవర్‌ క్రిస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఉగ్రదాడి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగిన వార్త వినగానే షాక్ కు గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. ఉగ్ర దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. టెర్రరిస్టుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -