యాక్ష‌న్ మూడ్‌లో చిరు!

10
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘విశ్వంభర’తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి విశ్వంభర టీమ్ అన్నీ క్రాఫ్ట్స్ లో చాలా కేర్ తీసుకుంటుంది.

ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌ లో వేసిన మ్యాసీవ్ సెట్ లో షూట్ జరుగుతోంది. ప్ర‌స్తుత షెడ్యూల్ ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ ను రామ్-ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్లు కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు. చిరుతో పాటు ప‌లువురు కీల‌క ఆర్టిస్టులు కూడా ఈ షూట్ లో పాల్గొంటున్నారు.

చిరు సరసన త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

Also Read:Bhatti:డ్రగ్స్‌తో జీవితాలు నాశనం

- Advertisement -