- Advertisement -
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ 2024 మొదటి , రెండో సంవత్సర ఫలితాలను సచివాలయంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరానికి సంబంధించి మొత్తం 2,54,498 (జనరల్ ) పరీక్షలు రాయగా అందులో 1,62,520 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు (63.86%) . ఒకేషనల్ కోర్సులో 18,913 మంది విద్యార్థులు హాజరు కాగా 10,070 (53.24% ) మంది ఉత్తీర్ణులయ్యారు.
రెండో సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షకు 1,38,477 (జనరల్) మంది రాయగా అందులో 60,615 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు (43.77%). ఒకేషనల్ కోర్సుల్లో 15,136 మంది విద్యార్థులు హాజరు కాగా 7,737 (51.12%) విద్యార్థులు పాస్ అయ్యారు.
Also Read:‘రేవు’..పార్టీలో హేమా హేమీలు
- Advertisement -