రాజాసింగ్ వర్సెస్ ఈటల!

21
- Advertisement -

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నేతలు అధ్యక్ష పదవిని ఆశీస్తుండగా ప్రధానంగా ఈటల రాజేందర్ పేరు వినిపిస్తోంది. అయితే బీజేపీకి అధ్యక్షుడిగా ఫైటర్ కావాలని ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఘాటుగా స్పందించారు ఈటల.

పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్‌ కావాలని అంటున్నారని.. ఎలాంటి ఫైటర్‌ కావాలి? స్ట్రీట్‌ ఫైటరా.. రియల్‌ ఫైటరా? అని ప్రవ్నించారు. తాను ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని..సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు పార్టీ అధ్యక్షుడిగా కావాలని తెలిపారు. అంతేతప్ప గల్లీలో కొట్లాడేవాళ్లు కాదని స్పష్టం చేశారు.

సీనియర్లకే అధ్యక్ష పదవి ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read:తెల్ల వెంట్రుక పీకితే..మరిన్నిపెరుగుతాయా?

- Advertisement -