ఓటీటీలోకి ‘లవ్ మౌళి’!

10
- Advertisement -

టాలెంటెడ్ యాక్టర్నవదీప్ చాలా రోజులు తరువాత నటిస్తున్న చిత్రం లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్.. ట్రావెలర్ గా కనిపించి మెప్పించాడు.

జూన్‌ 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది. తాజాగా ఓటీటీ డేట్ లాక్ అయింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’లో జూన్‌ 27వ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. మౌళి (నవదీప్) చిన్నప్పుడే అమ్మానాన్నలు విడిపోతారు.తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోవడంతో మౌళిని తాతయ్యే పెంచి పద్ద చేస్తాడు. మంచి చెడు నేర్పేవారెవరూ లేకపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్టు పెరుగుతాడు.సీన్ కట్ చేస్తే.. ఓ రోజు మౌళి అడవుల్లోకి వళ్తాడు. అక్కడ అతనికి ఓ అఘోరా కనిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ.

Also Read:ఆసీస్‌పై ఆఫ్ఘాన్‌ సంచలన విజయం

- Advertisement -