చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

10
- Advertisement -

చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట విషాదం నెలకొంది. సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్వాల్‌లోని పంచశీల కాలనీలో నివాసం ఉంటున్న రూపాదేవి..నిన్న అర్థరాత్రి ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయారు.

రూపాదేవి ఓ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నారు. రెండు నెలల క్రితమే రూపా, సత్యం, ఇద్దరూ ఆల్వాల్‌లోని శ్రీ చక్ర అపార్ట్మెంట్‌లోకి మారారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆత్మహత్య చేసుకునే ముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫోన్‌కు భార్య వీడియో కాల్ చేసిందని తెలుస్తోండగా ఆయన ఇంటికి వచ్చేలోపే భార్య ఇలా చేసుకుందని ఆ విషయం తెలుసుకున్న సత్యం స్పృహతప్పి పడిపోయారు. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ …సత్యంను పరామర్శించారు.

Also Read:AAP: కేజ్రీవాల్‌కు నిరాశే..

- Advertisement -