టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆంటిగ్వా వేదికగా బుధవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో తక్కువ ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి రికార్డు నెలకొల్పింది. నమీబియా విధించిన 73 పరుగుల టార్గెట్‌ని కేవలం 5.4 ఓవర్లలోనే చేధించింది.ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో 2 సిక్స్‌లు,5 ఫోర్లతో 34 పరుగులు చేయగా వార్నర్ 20,మార్ష్ 18 పరుగులు చేశారు.
ఇక ఈ విజయంతో పవర్ ప్లేలోనే మ్యాచ్ ముగించి అద్భుత విజయాన్ని అందుకుంది ఆసీస్. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక పేరుపై ఉంది. తాజాగా శ్రీలంక తర్వాత నిలిచిన రెండో జట్టుగా ఆసీస్ నిలిచింది.
అలాగే టీ20 వరల్డ్ కప్‌లో పవర్‌ప్లేలో ప్రత్యర్థిపై అత్యధిక ఆధిక్యాన్ని సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. నమీబియా మొదటి ఆరు ఓవర్లలో 17/3 స్కోరుతో నిలవగా ఆసీస్ 74/1 మెరుపు స్కోరు సాధించింది. ప్రత్యర్థి స్కోరు కంటే 57 పరుగులు ఎక్కువగా చేసింది.
Also Read:కల్కి 2898 ఎడి..సాలిడ్ రెస్పాన్స్!