- Advertisement -
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్.. 24 మంది మంత్రుల జాబితా విడుదల చేశారు. ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే కాగా ముగ్గురు మహిళలకు చోటు దక్కింది.
జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు చంద్రబాబు. టీడీపీ నుంచి నారా లోకేశ్, వంగలపూడి అనిత సహ పలువురు సీనియర్లకు ఛాన్స్ దక్కింది. ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన మాటను చంద్రబాబు నెలబెట్టుకున్నారు.
మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారని కూటమి వర్గాలు చెబుతున్నాయి. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇక పయ్యావుల కేశవ్ తన చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి దక్కించుకున్నారు.
Also Read:Babu:ఏ సామాజిక వర్గానికి ఎన్ని పదవులో తెలుసా?
- Advertisement -