TDP:శాసనసభాపక్షనేతగా చంద్రబాబు..

11
- Advertisement -

ఏపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు చంద్రబాబు. అమరావతిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.

చంద్రబాబును సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదించగా మూడు పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతం మాట్లాడిన చంద్రబాబు…తనని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ప్రజలు కూటమికి చారిత్రాక తీర్పు ఇచ్చారన్నారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని…నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారన్నారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయన్నారు. రేపు ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read:Modi:ఏపీ టూర్ షెడ్యూల్ ఇదే

- Advertisement -