ఏపీలో ఉచిత బస్సు..గుడ్ న్యూస్

14
- Advertisement -

ఏపీలో టీడీపీ కూటమి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే హామీని ఇచ్చి అధికారంలోకి రాగా ఆర్టీసీ లాభ,నష్టాల సంగతి పక్కన పెడితే ఈ పథకాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఇక ఏపీలో టీడీపీ కూటమి సైతం అధికారంలోకి రావడంతో ఉచిత బస్సు విధివిధానాలపై కసరత్తు ప్రారంభించారు.

ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలనే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే ఏపీలో కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా.. పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నారు. ఇలా జారీచేసిన టికెట్ల అసలు ఛార్జీని లెక్కించి.. ఆ డబ్బుల్నిరీయింబర్స్‌ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరుతుంది. ఇదే ఏపీలోనూ వర్తించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read:‘మహారాజ’..అందరికి నచ్చుతుంది:విజయ్ సేతుపతి

- Advertisement -