డిప్యూటీ సీఎంగా పవన్‌!

14
- Advertisement -

ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నెల 12న సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తికాగా మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

టీడీపీ కూటమి విజయంలో కీలకపాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతారని సమాచారం. అలాగే బీజేపీకి కేబినెట్‌లో రెండు మంత్రిపదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మంత్రివర్గ విస్తరణలో జిల్లాల వారీగా పేర్లను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, అశోక్, కూనరవికుమార్, మురళి ,విజయనగరం నుంచి కళా వెంకట్రావు, సంధ్యారాణి,విశాఖపట్టణం నుంచి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్ రావు, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాస్ యాదవ్,ఉభయ గోదావరి జిల్లాల్లో జ్యోతుల నెహ్రూ, చిన్నరాజప్ప, యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరితో పాటు రామానాయుడు, రఘురామ రాజు రేసులో ఉన్నారు.

అలాగే కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమ, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ, కొల్లు రవీంద్ర,గుంటూరు జిల్లా నుంచి నారా లోకేశ్, దూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్,ప్రకాశం జిల్లా నుంచి గొట్టుపాటి రవి, వీరాంజనేయ స్వామి,నెల్లూరు నుంచి నారాయణ, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,చిత్తూరు జిల్లా నుంచి కిశోర్ కుమార్ రెడ్డి ,అనంతపురం జిల్లా రేసులో పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, గుమ్మనూరి జయరాం,కడప నుంచి మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ కోటాలో రాంభూపాల్ రెడ్డి, పుట్టా సుధాకర్, కర్నూల్ జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, అఖిలప్రియ, బీసీ జనార్దన్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లో ఒకరిద్దరికి మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది.

Also Read:శివకార్తికేయన్‌కు విలన్‌గా విద్యుత్‌ జమ్వాల్‌

- Advertisement -