NBK 109 :ఫ్యాన్స్‌కు అదిరే పండగే!

6
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అఖండ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాబీ దర్శఖత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్‌లో ఇది 109వ సినిమా కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తమన్ సంగీతం అందిస్తుండగా విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్‌ రాగా ఇప్పుడు మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర బృందం సిద్ధ‌మైంది. బాల‌య్య పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న సినిమా నుండి సాలీడ్ అప్‌డేట్‌ను ఇవ్వ‌నున్నారు. దీంతో బాలయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

Also Read:ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’!

- Advertisement -