రాజ్ తరుణ్ తాజా చిత్రంగా ‘అంధగాడు’ ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లు రాజ్ తరుణ్ నటనకి మంచి మార్కులు వేస్తున్నారు. ఈ సినిమాలో పోషించిన గౌతమ్ పాత్రకి ఆయన పూర్తి న్యాయం చేశాడని అంటున్నారు.అయితే తాజాగా మెగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను చూసి హీరో రాజ్‌తరుణ్ గురించి స్సందించాడు.
‘అంధగాడు’ సినిమాను తాను చూశానని… ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటన తనను చాలా ఆకట్టుకుందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నాడు. సాధారణంగా కామెడీ టచ్ తో ఉండే క్యారెక్టర్లను చేసే రాజ్ తరుణ్… ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించాడని కితాబిచ్చాడు. సినిమా మొత్తం రకరకాల మలుపులు తిరుగుతూ, ఆసక్తికరంగా కొనసాగుతుందని తెలిపాడు. సినిమా చాలా బాగుందని… చిత్రానికి సంబంధించిన టీమ్ మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పాడు.
అయితే ఈ సినిమాలో చూపులేని కథానాయకుడికి డాక్టర్ అయిన కథానాయిక చూపును తెప్పిస్తుంది. మరి చూపు వచ్చిందనే ఆనందం ఎక్కువ కాలం లేకుండా కథానాయకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేయవలసి వస్తుంది. చూపులేనప్పుడు .. చూపు వచ్చాక గల వైవిధ్యాన్ని రాజ్ తరుణ్ ఈ పాత్రలో అద్భుతంగా పండించాడని చెబుతున్నారు. కామెడీ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా చేశాడని అంటున్నారు. ఈ సినిమా ఆయన కెరియర్ కి తప్పకుండా హెల్ప్ అవుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.