ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వైసీపీ ఓటమి నేపథ్యంలో జగన్ సీఎంవోపై ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.సీఎంవో కార్యాయంలో పనిచేసే అధికారుల ప్రవర్తన వల్ల నియోజకవర్గ సమస్యలను నేరుగా వైఎస్ జగన్కు చెప్పుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు వెళితే సీఎంవో తీరుతో కలిసేందుకు వీలయ్యేది కాదని ఆరోపించారు. మంత్రులు , ఎమ్మెల్యేలు సైతం అనేక ఇబ్బందులు పడ్డారని, గంటల తరబడి ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు.
ధర్మవరం రైల్వే ఉపరితల వంతెన నిర్మాణం కోసం భూసేకరణకు అవసరమయ్యే రూ.15 నుంచి రూ.20 కోట్ల మంజూరికి వందసార్లు సీఎం కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి పోయానని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడం వల్లే అత్యధిక స్థానాల్లో గెలుపొందారని వెల్లడించారు.
Also Read:Gold Price:పసిడి లేటెస్ట్ ధరలివే