- Advertisement -
వైసీపీ శ్రేణుల దాడులపై స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల ఫలితాల అనంతరం కొన్నిచోట్ల నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు చంద్రబాబు.
పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలని …వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని కోరారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్ల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గుడివాడలో కొడాలి నాని ఇంటిపై ,మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి దగ్గర కూడా ఉద్రిక్తత తలెత్తింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపేశారు.
Also Read:మైత్రీ మూవీ మేకర్స్…’8 వసంతాలు’
- Advertisement -