- Advertisement -
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. 175 స్థానాల్లో కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు జగన్.
తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, కొడాలి నానితో భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించారు జగన్. ఓటమికి గల కారణాలపై విశ్లేషించారు. జగన్‌ను కలవడానికి వచ్చిన వారిలో మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసినప్పటికీ ఘోరంగా ఓడిపోవడంపై వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:ఎంపీగా గెలిచిన చిరు హీరోయిన్!
- Advertisement -