మందకొడిగా ఎమ్మెల్సీ కౌంటింగ్..

6
- Advertisement -

నల్గొండ- వరంగల్ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మందకొడిగా సాగుతోంది. నిన్న ఉదయం 8 గం.కు కౌంటింగ్ ప్రక్రియ. మొదలుకాగా ఇప్పటివరకు 4 రౌండ్ లలో రెండు రౌండ్ లు పూర్తి అయింది. అధికారులకు చెల్లని ఓట్లు తలనొప్పిగా తయారయ్యాయి.

చెల్లని ఓటు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కౌంటింగ్ కు ఆలస్యం అవుతోంది. పట్టభద్రులకు అవగాహన లోపం తో అత్యధికంగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. జై జై అని కొందరు. . ఐ లవ్ యూ అంటూ మరి కొందరు..,రైట్ గుర్తు పెట్టి కొందరు .బ్యాలెట్ పేపర్ తిరగేసి అంకెలు వేసిన ఇంకొందరు…..ఇలా అవగాహనా రాహిత్యం తో ఓట్లు మురిగిపోతున్న పరిస్థితి నెలకొంది.

Also Read:రాజకపోతాసనంతో ఉపయోగాలు!

- Advertisement -