ధర్మం దే విజయం..వీరమల్లు స్పెషల్ పోస్టర్

14
- Advertisement -

ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక పోటీ చేసిన 21 స్థానాలు, 2 ఎంపీ సీట్లలో విజయం సాధించింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు టీం కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

ధర్మం దే విజయం అంటూ సినిమాలో వచ్చే డైలాగ్‌ను గుర్తు చేస్తూ పవన్‌ కల్యాణ్‌ విక్టరీని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు మేకర్స్‌. విక్టరీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌, అభిమానుల కోసం విడుదల చేసిన నయా పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

పవన్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ మూవీకి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. రెండుపార్టులుగా సినిమా తెరకెక్కుతోంది.

Also Read:ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ..

- Advertisement -