మంత్రి రోజా వేదాంతం..

15
- Advertisement -

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ చతికిలపడిపోయింది. కూటమి ముందు ఫ్యాన్ గాలి ఆగిపోయింది. 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. జగన్ కేబినెట్‌లో మెజార్టీ సభ్యులు ఓటమి పాలయ్యే పరిస్థితి నెలకొంది. ఇక నగరిలో మంత్రి రోజా సైతం ఓటమి బాటలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి రోజా తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. భయాన్ని విశ్వాసంగా.. ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారుతారు అని రోజా పేర్కొన్నారు.

- Advertisement -