- Advertisement -
రాష్ట్ర సచివాలయంలో వాస్తు మార్పులు చేపట్టాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు సచివాలయంలో సీఎం కార్యాలయం ఆరో అంతస్తులో ఉండగా ఇప్పుడు దానిని 9వ అంతస్తుకు మార్చనున్నారు. అలాగే సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయి సెక్రటేరియట్‌లోకి వచ్చేది. కానీ ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లిపోనున్నట్లు సమాచారం.
అలాగే సెక్రటేరియట్ లోపల సైతం మరికొన్ని మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో సీఎంవో ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి. సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి.
Also Read:Sonia:ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారే
- Advertisement -