జై తెలంగాణ అని ఒక్క మాట పలుకలేని మూర్ఖుడు సీఎం రేవంత్ అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ముఖ్యమంత్రికి కనీస అవగాహన, పరిపక్వత లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన భూపేశ్ భగేల్.. ఛత్తీస్‌గఢ్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు నిర్వహించారని చెప్పారు.
సీఎం రేవంత్ జాక్‌పాట్ ముఖ్యమంత్రి అని, ఏదో అదృష్టవశాత్తు సీఎం అయ్యాడని ఎద్దేవా చేశారు. ఈ విషయం తెలంగాణ మొత్తానికి తెలుసని, ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నదని చెప్పారు. తప్పకుండా ఆయనకు బుద్ధిచెప్పే రోజులు వస్తాయన్నారు.
కానీ మన సీఎం మాత్రం దశాబ్ది వేడుకలను ఒక్క రోజుకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వంలో ఉంటే నెలరోజులు నిర్వహించేవాళ్లమని చెప్పారు. తెలంగాణ గురించి గానీ, తెలంగాణ ఏర్పాటులో ఉన్న త్యాగాల గురించి గానీ, జై తెలంగాణ అని ఒక్క మాట పలుకలేని మూర్ఖుడన్నారు.
Also Read:KCR:తెలంగాణ వాల్లే అవమానించే పరిస్థితి?