ఉత్కటాసనతో అధిక బరువుకు చెక్!

10
- Advertisement -

నేటి రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధ పడుతుంటారు. ముఖ్యంగా తొడల భాగంలోనూ, ఉదయం చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ఒక పెద్ద సవాల్ గా ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని ఆయా భాగాల్లో కొవ్వు కరిగించవచ్చు. కానీ వయసు పైబడిన వారు వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపరు. అలాంటి వారికి యోగా ఒక చక్కటి వరంలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉదర, తొడల భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి యోగాలో ఉత్కటాసనం ఎంతో ఉపయోగ పడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఈ ఆసనం వేయడం వల్ల పెరుకుపోయిన కొవ్వు చాలా ఈజీగా కరిగిపోతుంది. ఈ ఆసనాన్ని మహిళలు, పురుషులు, ఏ వయసు వారైనా వేయవచ్చు.

మొదట రెండు పాదాలను దగ్గర ఉంచి నిటారుగా నిలబడాలి. ఆ తరువాత శ్వాస బాగా తీసుకొని రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గరకు మడిచి కుర్చీ ఆకారంలో సగం వరకు ఫోటోలో చూపిన విధంగా బెండ్ అవ్వాలి. ఆ తరువాత రెండు చేతులను పైకెత్తి నమస్కారం చేస్తున్నట్లుగా కలపాలి. శ్వాసక్రియ నెమ్మదిగా జరిగిస్తూ వీలైనంత సేపు ఈ ఆసనంలో ఉండాలి.

ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల తొడలు, పొట్ట భాగంలోని కొవ్వు కరిగిపోతుంది. ఇంకా ఉదర కండరాలు బలపడతాయి. కాళ్ళు, చేతులు, వెన్నెముక దృఢంగా మారతాయి. తీవ్రమైన నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఆసనం వేయరాదు.

Also Read:మా రహస్యం ఇదం జగత్‌ …అప్‌డేట్

- Advertisement -