విశ్వంభర సెట్స్‌లో అజిత్‌కుమార్‌!

7
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

తాజాగా విశ్వంభర సెట్స్‌లో దర్శనమిచ్చారు హీరో అజిత్. విశ్వంభర సెట్స్‌లో దర్శనమిచ్చి చిరంజీవికి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు చిరంజీవి. షూటింగ్‌ లొకేషన్‌ నుంచి మా దగ్గరకు వచ్చారు. నా చేతుల మీదుగా నిర్వహించిన అజిత్ డెబ్యూ సినిమా ప్రేమ పుస్తకం మ్యూజిక్‌ లాంఛ్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం. చాలా ఏండ్లుగా అజిత్‌ కుమార్‌ సూపర్‌ స్టార్‌డమ్‌ సంపాదించుకోవడం సంతోషంగా ఉందని చిరు చెప్పారు.

అజిత్‌ కుమార్‌ గుడ్‌ బ్యాడ్ అగ్లీ షూట్‌లో ఉన్నాడు అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు చిరు. అజిత్ టీం హైదరాబాద్‌ షెడ్యూల్ పూర్తయిన తర్వాత త్వరలోనే అజిత్‌ టీం రష్యాకు వెళ్లనుందని ఇన్‌సైడ్‌ టాక్‌. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.

Also Read:240కి పైగా దేశాల్లో స‌త్య‌దేవ్ ‘కృష్ణ‌మ్మ‌’

- Advertisement -