NKR21లో రాములమ్మ!

14
- Advertisement -

టాలీవుడ్ రాములమ్మ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై అలరించనున్నారు. బింబిసారతో గ్రాండ్ సక్సెస్‌ అందుకున్న నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ కెరీర్‌లో ఇది 21వ సినిమా కాగా NKR21 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది.

ఈ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుందని మేకర్స్ ప్రకటించారు. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ చిత్రం నుంచి షూటింగ్ స్పాట్‌ విజువల్స్‌తోపాటు అదిరిపోయే పంచ్‌తో కట్‌ చేసిన NKR21 గ్లింప్స్‌ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది.

ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోండగా ఈ బ్యానర్‌లో ఇది రెండో సినిమా. ఈ చిత్రాన్ని అశోక్‌ వర్ధన్‌ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌తో కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సోహైల్‌ఖాన్‌, సాయి మంజ్రేకర్‌, శ్రీకాంత్‌ ముఖ్యపాత్రలు ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

Also Read:KTR:రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా?లేనట్టా..?

- Advertisement -