రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా?లేనట్టా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ??,పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?,ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ??అని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?? అన్నారు.నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..!
నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!!,పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి ?? అన్నారు.
సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు..ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా ??,తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే..సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా ?? అని ప్రశ్నించారు.
Also Read:అశ్వ సంచాలనాసనంతో వెన్నునొప్పికి చెక్!
https://x.com/KTRBRS/status/1795659037675291045

