KTR:కాకతీయ తోరణం రాచరిక పోకడనట?

16
- Advertisement -

పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ గారు తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటె అది రాచరిక పోకడనట అని విమర్శించారు.

కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“ అని పాడుకోవాలి !!?,“కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి !!?,అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా ? అని ప్రశ్నించారు.

Also Read:గం..గం..గణేశా..సక్సెస్ కావాలి:రష్మిక

- Advertisement -